Header Banner

మంచు లక్ష్మికి షాక్! సెలబ్రిటీలు టార్గెట్‌గా..! నైజీరియా నుంచి బెదిరింపులు!

  Thu Apr 17, 2025 16:36        Cinemas

ఇటీవల సినీ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన X (ట్విట్టర్) అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. నైజీరియా నుంచి గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావడం, బెదిరింపులు ఎదురవడం వల్ల తాను భయపడుతున్నట్లు తెలిపారు. తన పేరుతో వచ్చిన మెసేజ్‌లను పట్టించుకోవద్దని అభిమానులకు ఆమె విజ్ఞప్తి చేశారు. “నాకే డబ్బులు కావాలంటే నేరుగా అడుగుతాను, సోషల్ మీడియాలో అడగను” అంటూ స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తూ, నైజీరియా హ్యాకర్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తిరిగి తమ చేతికి వచ్చిన తర్వాత మళ్లీ వివరాలు తెలియజేస్తానని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఆమె తమ్ముడు మంచు మనోజ్‌ను చూసి భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో మంచు ఫ్యామిలీలో విభేదాలు, భావోద్వేగ బాండింగ్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో ఆమె అకౌంట్ హ్యాక్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి..

 

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

 

అమరావతి పర్యటన.. ప్రధాని మోదీ షెడ్యూల్‌ ఖరారు.!

 

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

 

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!

 

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ManchuLakshmi #InstagramHacked #CyberSafety #OnlineThreats #SocialMediaHacking #TollywoodNews #CelebrityHacking #ManchuFamily #StaySafeOnline #CyberCrimeAlert